Fri Dec 20 2024 14:27:11 GMT+0000 (Coordinated Universal Time)
అన్స్టాపబుల్ విత్ ఎన్బీకేలో చంద్రబాబు
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే రెండో సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఈ మేరకు షూటింగ్ మొదలయిందని మోక్షజ్ఞ కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా పాల్గొననున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందన్నది ఇంకా తెలియరాలేదు.
ఏ ప్రశ్నలుంటాయో?
ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సక్సెస్ అయింది. దీంతో రెండో సీజన్ కూడా ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ బయటకు వదిలారు. అయితే తన బావ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి బాలకృష్ణ తన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు రాబడతారు? ఏయే అంశాలు ప్రస్తావిస్తారు? కుటుంబ విషయాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఈ ఎపిసోడ్ లో బాలయ్య సూటి ప్రశ్నలు వేస్తారంటున్నారు. బాలకృష్ణ అభిమానులతో పాటు రాజకీయ నేతలు కూడా ఈ ఎపిసోడ్ పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story