Wed Dec 25 2024 12:53:37 GMT+0000 (Coordinated Universal Time)
భలే ఛాన్స్ కొట్టేసిన నందిత శ్వేత
సినిమాహాల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లోకి హీరోయిన్ నందిత శ్వేత అడుగు పెట్టింది. ఈ బ్యానర్ నుండి వస్తున్న తొలిచిత్రంలో లీడ్ పాత్రలో నటించనుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన నందిత తమిళంలో స్ట్రాంగ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సినిమాహాల్ ఎంటర్ టైన్మెంట్ లో ప్రారంభం అవుతున్న ఈ మూవీ కథ తనను చాలా ఇంప్రెస్ చేసిందని ట్విట్టర్ ద్వారా తన ఆనందం తెలయజేసింది. త్వరలో ప్రారంభం అయ్యే ఈ మూవీకి సంగీతం సురేష్ బొబ్బిలి, దర్శకుడు చిన్నిక్రిష్ణ. ఈ మూవీ ప్రారంభం రోజునే కంటెంట్ కి రిలేట్ అయ్యే ఒక టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. నందిత శ్వేత లీడ్ రోల్ ప్లే చేసే ఈ మూవీ లో మిగిలిన నటీనటులను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ సినిమాకు అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి నిర్మాతలుగా ఉన్నారు.
Next Story