ఆ సినిమాతో దిష్టి పోయిందట..!
తెలుగులో ఇప్పుడున్న మీడియం రేంజ్ హీరోలలో సక్సెస్ రేట్ కేవలం నాచురల్ స్టార్ నానికి మాత్రమే ఉంది. అతను ఏ సినిమా చేసిన మినిమం గ్యారంటీ అవుతున్నాయి. 'ఎవడే సుబ్రమణ్యం' దగ్గర నుండి ‘ఎంసీఏ’ వరకు తీసుకుంటే అన్ని సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. ‘మజ్ను’, ‘జెంటిల్‌మేన్’ తప్ప. వాటికీ నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ అవి కూడా వసూళ్లు బాగానే తెచ్చిపెట్టాయి. అయితే ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం నాని కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది.
అన్నింటిలానే కష్టపడ్డాను...
ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా కూడా నిర్మాతలకి నష్టాలు తెచ్చిపెట్టింది. నాని కెరీర్ లో ఇప్పటివరకు ఎప్పుడు తన నటన గురించి చిన్న రిమార్క్ కూడా లేదు కానీ ఈ సినిమాతో ఆ మార్క్ వచ్చింది. ఈ సినిమాలో రాక్ స్టార్ పాత్ర విషయంలో ఆయనకు ఎన్నో విమర్శలకు వచ్చాయి. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఆ సినిమా గురించి తాను నెగెటివ్‌గా మాట్లాడనని అంటున్నాడు నాని. అన్ని సినిమాలకు ఎంత కష్టపడతానో ఈ సినిమాకి కూడా అంతే కష్టపడ్డానని..నూటికి నూరు శాతం కష్టపడి ఈ సినిమా చెశానని కానీ.. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఎన్నో అశలు పెట్టుకున్నా ప్రేక్షకులకి నచ్చలేదని నాని అన్నారు.
ఎదురుదెబ్బలు ఎవరికైనా తప్పవు...
జీవితంలో ఎదుగుతున్నపుడు ఇలాంటి ఎదురు దెబ్బలు, అడ్డంకులు ఎదురవుతాయని.. వాటి గురించి మరీ ఎక్కువ ఆలోచించకూడదని నాని అన్నాడు. ఇన్ని సక్సెస్ లు ఉన్న నాకు ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం దిష్టి తగలకుండా ఉండటానికి వచ్చిందేమో అని నాని అన్నాడు. ఈ రోజు విడుదల అయిన 'దేవదాస్' చిత్రంతో ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవ్వుతారని ధీమా వ్యక్తం చేశాడు.