Thu Dec 19 2024 18:28:10 GMT+0000 (Coordinated Universal Time)
పండక్కి రెండ్రోజుల ముందే నాని "దసరా"
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దసరా కానుకగా..
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న "దసరా" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో నాని ఊరమాస్ లుక్ లో కనిపించడంతో సినిమా ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. సింగరేణి ఘనుల నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దసరా కానుకగా 'ధూంధాం దోస్తాన్' అంటూ సాగే ఈ పాటను అక్టోబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, నాని తో మరోసారి కీర్తి సురేష్ జతకడుతోంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే అక్టోబర్ 3 వరకూ ఆగాల్సిందే. నాని "దసరా" వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
Next Story