Sat Dec 21 2024 14:11:56 GMT+0000 (Coordinated Universal Time)
'ఎట్లైతే గట్లే సూస్కుందామ్'.. సిల్క్స్మిత ఫొటో ముందు మందు సీసాతో నాని
సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న దసరా సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను..
నేచురల్ స్టార్ నాని.. ఇటీవల "అంటే సుందరానికి" అనే క్లాస్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. నెక్స్ట్ దసరా సినిమాతో ఫుల్ మాస్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. నాని - కీర్తి సురేష్ జంటగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తోంది చిత్రబృందం. పోస్టర్లు, గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. పైగా ఇప్పటివరకూ నాని ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ చేయలేదు. ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో దసరాపై అందరికీ అంచనాలున్నాయి.
సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న దసరా సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. సమ్మర్ కానుకగా 2023 మార్చి 30న దసరా సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్ని నాని షేర్ చేస్తూ.."ఎట్లైతే గట్లనే సూస్కుందామ్. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని ట్వీట్ చేశాడు. నాని షేర్ చేసిన పోస్టర్ లో ఓ గోడ మీద సిల్క్ స్మిత పెయింట్ వేసి ఉండగా దాని ముందు నాని ఓ మందు సీసాని పట్టుకొని కూర్చున్నట్లు చూపించారు. ఇక ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడంతో.. నాని కూడా ఆ దిశగానే వెళ్తున్నాడు. దసరా సినిమా కూడా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది.
Next Story