Thu Dec 19 2024 18:13:30 GMT+0000 (Coordinated Universal Time)
దసరా ట్రైలర్ వచ్చేసింది.. పవర్ ప్యాక్డ్ పక్కా మాస్ ఎంటర్టైనర్
‘పురాణాలను మించిన బ్రతుకులా మనవి. పది తలలు ఉన్నవాడే ఒక్క తల ఉన్నవాడి చేతిలో కుక్క సావు సచ్చాడు’
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న దసరా సినిమా నుంచి ట్రైలర్ రానే వచ్చింది. ఈ సినిమాతో నాని గతంలో ఎన్నడూ లేనట్టుగా.. కంప్లీట్ మాస్ మూలవిరాట్ రూపంలో కనిపించబోతున్నాడు. 90ల కాలంలో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర పనిచేసిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ మరోసారి నానితో జతకట్టింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి హైప్ క్రియేట్ చేశాయి.
తాజాగా విడుదలైన ట్రైలర్ మొత్తాన్నీ డైరెక్టర్ పవర్ ప్యాకెడ్ యాక్షన్ సీన్స్ తో నింపేశాడు. ట్రైలర్ లో సముద్రఖని చెప్పిన డైలాగ్ ముఖ్యంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. ‘పురాణాలను మించిన బ్రతుకులా మనవి. పది తలలు ఉన్నవాడే ఒక్క తల ఉన్నవాడి చేతిలో కుక్క సావు సచ్చాడు’ అనే డైలాగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉందని ట్రైలర్ లాస్ట్ ఫ్రేమ్ చూస్తే అర్ధమవుతుంది. హీరో, హీరోయిన్ లు మధ్య చిన్నపాటి నుంచే ప్రేమ ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పథకం పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ప్రాజెక్ట్ K సినిమాకి సంగీతం అందించబోతున్న సంతోష్ నారాయణన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నానికి స్నేహితుడిగా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న దసరా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Next Story