Sun Dec 22 2024 21:49:19 GMT+0000 (Coordinated Universal Time)
సూర్య సినిమాకి అవార్డు రానందుకు బాధపడుతున్న నాని.. అభిమానుల రియాక్షన్ వైరల్!
సూర్య సినిమాకి అవార్డు రాలేదని నాని బాధపడుతూ పోస్ట్ చేయగా.. దానికి అభిమానుల రియాక్షన్స్ వైరల్ అవుతున్నాయి.
69వ జాతీయ అవార్డుల విజేత లిస్ట్ వచ్చేసింది. 2021 గాను భారత ప్రభుత్వం 'నేషనల్ ఫిలిం అవార్డ్స్' (National Film Awards 2023) ని తాజాగా ప్రకటించగా.. ఈ పురస్కారంలో తెలుగు చిత్రాలు విజయ పతాకం ఎగరవేశాయి. 10 నేషనల్ అవార్డులను అందుకోవడంతో పాటు తెలుగు పరిశ్రమ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 'ఉత్తమ నటుడు' అవార్డు కూడా ఈ ఏడాది వరించడం ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో టాలీవుడ్ అంతా సంతోష పడుతుంటే.. నేచురల్ స్టార్ నాని మాత్రం తమిళ్ హీరో సూర్య (Suriya) సినిమాకి అవార్డు రాలేదని బాధ పడుతున్నాడు. సూర్య ప్రధాన పాత్రలో నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'జై భీమ్' (Jai Bhim). ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచింది. మూవీలోని స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్ ప్రతి ఒక్కర్ని కట్టిపడేసింది. నాని లాగానే చాలామంది ఈ సినిమాకి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని అని అనుకున్నారు.
ఇక ఈ చిత్రానికి అవార్డు రాకపోవడంతో నాని తన ఇన్స్టా స్టోరీలో 'జై భీమ్' అని పెట్టి హార్ట్ బ్రేక్ సింబల్ తో షేర్ చేశాడు. అంతకు ముందుకు పోస్ట్ లో నేషనల్ అవార్డు గెలుచుకున్న తెలుగు స్టార్స్ అందర్నీ విష్ చేశాడు. అయితే ఈ పోస్ట్ చూసిన కొంతమంది నెటిజెన్స్.. "నీ సినిమా 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) కి కూడా అవార్డు రావాల్సి ఉంది. దాని గురించి కూడా బాధ పడు అన్న" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నేషనల్ అవార్డు ప్రకటించిన దగ్గర నుంచి చాలా మంది నెటిజెన్స్.. "శ్యామ్ సింగరాయ్ సినిమాకి, నటుడిగా నానికి, నటిగా సాయి పల్లవికి అవార్డులు వరించాలి. కానీ జ్యూరీ ఈ చిత్రం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించింది" అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 'జెర్సీ' సినిమాకి కూడా జ్యూరీ ఇలా వ్యవహరించి అవార్డు ఇవ్వకుండా పక్కన పెట్టిందని నాని అభిమానులు తమ భాదని వ్యక్తం చేస్తున్నారు.
Next Story