అమెరికా లో నాని సందడి
నాని కి తెలుగు రాష్ట్రాల్లో కన్న యుఎస్‌లో మంచి మార్కెట్ ఉంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తోనే అమెరికా లో అదరగొట్టిన నాని ఆ తరువాత ‘భలే భలే [more]
నాని కి తెలుగు రాష్ట్రాల్లో కన్న యుఎస్‌లో మంచి మార్కెట్ ఉంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తోనే అమెరికా లో అదరగొట్టిన నాని ఆ తరువాత ‘భలే భలే [more]
నాని కి తెలుగు రాష్ట్రాల్లో కన్న యుఎస్‌లో మంచి మార్కెట్ ఉంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తోనే అమెరికా లో అదరగొట్టిన నాని ఆ తరువాత ‘భలే భలే మగాడివోయ్’ తో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.
పెద్ద హీరోలకు కూడా కష్టంగా ఉన్న మిలియన్ డాలర్ మార్కును నాని చాలాసార్లు అలవోకగా అందుకున్నాడు. రీసెంట్ గా అతని కొత్త సినిమా జెర్సీ కూడా అలవోకగా ఆ మార్కును దాటేస్తోంది. అక్కడ వీకెండ్ ముగిసేసరికి మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరుకోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు.
గురువారం ప్రిమియర్ల ద్వారా ‘జెర్సీ’కి 1.45 లక్షల డాలర్ల కలెక్షన్ వచ్చింది. ఇక శుక్రవారం అంచనాలు మించి 2.6 లక్షల డాలర్లకు పైగా కొల్లగొట్టింది. దీనితో ప్రిమియర్లతో కలిపి తొలి రోజుకే 4 లక్షల డాలర్ల మార్కును దాటేసింది ‘జెర్సీ’. శనివారం ఈ వసూల్ డబల్ ఉండే అవకాశముంది.మినిమం మూడు లక్షల డాలర్లు గ్యారెంటీ గా వచ్చే ఛాన్స్ ఉంది. ఆదివారం కూడా అదే జోరు కొనసాగిస్తే వీకెండ్ మొత్తం కలిపి మిలియన్ డాలర్స్ రావడం ఖాయం అంటున్నారు. ఇంకా ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఈసినిమా 1.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకునే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈమూవీ మంచి వసూల్ తో దూసుకుపోతుంది.