నానికి కావాల్సింది టాక్ ఒక్కటే..!
నానికి ప్రస్తుతం హిట్ చాలా అవసరం. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ చిత్రాలతో నిరాశపరిచాడు. ఇప్పుడతని లేటెస్ట్ మూవీ జెర్సీపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాకు కొంచం పాజిటివ్ [more]
నానికి ప్రస్తుతం హిట్ చాలా అవసరం. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ చిత్రాలతో నిరాశపరిచాడు. ఇప్పుడతని లేటెస్ట్ మూవీ జెర్సీపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాకు కొంచం పాజిటివ్ [more]
నానికి ప్రస్తుతం హిట్ చాలా అవసరం. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ చిత్రాలతో నిరాశపరిచాడు. ఇప్పుడతని లేటెస్ట్ మూవీ జెర్సీపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాకు కొంచం పాజిటివ్ టాక్ వస్తే చాలు నాని సత్తా ఏంటో చూపిస్తాడు. పైగా ఈ సినిమా మంచి సమ్మర్ సెలవుల్లో రిలీజ్ అవుతుంది. జెర్సీ సినిమాపై రెండు ఫ్లాపుల ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ సినిమాకు మొదటి నుండే మంచి టాక్ ఉంది. లేటెస్ట్ గా ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడం, సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
పోటీ కూడా లేకపోవడంతో…
నాని కెరీర్లోనే అత్యధికంగా రూ.50 కోట్లకు పైగా ఈ చిత్రానికి బిజినెస్ జరగడం విశేషం. సెలవులు కావడం, ఎమోషనల్ ఎంటర్టైనర్ కాబట్టి 50 కోట్ల బిజినెస్ అనేది పెద్ద విషయమే కాదు. పోటీకి కాంచన 3 ఉన్నా దీనిపై జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా చప్పగా సాగుతున్నాయి. మజిలీ, చిత్రలహరి సినిమాలకు మరీ గొప్పగా టాక్ లేకపోయినా మంచి వసూళ్లు సాధించాయి. వాటితో పోలిస్తే ‘జెర్సీ’ రేంజ్ ఎక్కువే. కాబట్టి నానికి కావాల్సింది టాక్ ఒకటి పాజిటివ్ గా వస్తే చాలు.