Mon Dec 23 2024 06:50:00 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్కార్ రేసులోకి "శ్యామ్ సింగరాయ్"
థియేట్రికల్ రన్ తర్వాత.. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన శ్యామ్ సింగరాయ్ మరిన్ని రికార్డులు సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో ఊహించని రీతిలో..
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని - సాయిపల్లవి- కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పీరయాడికల్ ఫిల్మ్ శ్యామ్ సింగరాయ్. గతేడాది డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. కరోనా తర్వాత విడుదలై మంచి విజయం అందుకున్న సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. మొదటి సారి నాని ఓ పీరియాడిక్ పాత్రలో నటించగా.. సాయిపల్లవి నటన, డ్యాన్స్ కు పేరుతెచ్చిపెట్టింది ఈ సినిమా.
థియేట్రికల్ రన్ తర్వాత.. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన శ్యామ్ సింగరాయ్ మరిన్ని రికార్డులు సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో ఊహించని రీతిలో అత్యధిక రేటింగ్ సాధించి దాదాపు 10 వారాలపాటు టాప్ ట్రెండ్ లో నిలిచింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతుంది. శ్యామ్ సింగరాయ్ సినిమాని భారతదేశం తరపున మూడు విభాగాలలో ఆస్కార్ నామినేషన్లకు పంపిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. పీరియాడిక్ ఫిల్మ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్ అనే మూడు కేటగిరీలలో శ్యామ్ సింగరాయ్ ను ఆస్కార్ నామినేషన్లకు పంపుతున్నారు. ఆస్కార్ అవార్డు రాకపోయినా.. నామినేషన్లకు సెలెక్ట్ అయినా శ్యామ్ సింగరాయ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్లే.
Next Story