ట్రెండ్ మార్చాల్సిన టైం వచ్చింది!
ఈ కరోనా క్రైసిస్ లు అవీ ఇవీ అన్ని పక్కనబెట్టేస్తే.. ఏడాదికి రెండు మూడు సినిమాలతో చక్కగా కళకళలాడిపోయేవాడు నాని. ఒక సినిమా తేడా కొట్టినా ఇంకో [more]
ఈ కరోనా క్రైసిస్ లు అవీ ఇవీ అన్ని పక్కనబెట్టేస్తే.. ఏడాదికి రెండు మూడు సినిమాలతో చక్కగా కళకళలాడిపోయేవాడు నాని. ఒక సినిమా తేడా కొట్టినా ఇంకో [more]
ఈ కరోనా క్రైసిస్ లు అవీ ఇవీ అన్ని పక్కనబెట్టేస్తే.. ఏడాదికి రెండు మూడు సినిమాలతో చక్కగా కళకళలాడిపోయేవాడు నాని. ఒక సినిమా తేడా కొట్టినా ఇంకో రెండు సినిమాలు నానిని గట్టెక్కించేసేవి. కంటిన్యూస్ గా సక్సెస్ ఫుల్ హీరోగా మినిమమ్ గ్యారెంటీ ఉన్న హీరోగా దూసుకొస్తున్న నానికి లాస్ట్ టు ఇయర్స్ నుండి మాత్రం చుక్కెదురవుతుంది. దేవదాసు, కృష్ణార్జున యుద్ధం, గ్యాంగ్ లీడర్, వి మూవీ, జెర్సీ సినిమాలన్నీ నానికి కొన్ని ప్లాప్ లు కొన్ని యావరేజ్ లు ఇచ్చాయి. నాగ్ తో మల్టీస్టారర్ గా చేసిన దేవదాసు సో సో టాక్ తో ఆడగా.. మంచి అంచనాల మధ్యన విడుదలైన కృష్ణార్జున యుద్ధం ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. జెర్సీ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ రాలేదు. గ్యాంగ్ లీడర్ కూడా సో సో టాక్ తో ఆడింది. ఇక గత ఏడాది నాని విలన్ గా నటించిన వి సినిమా ఓటిటిలో విడుదలై ప్లాప్ గా మిగిలిపోయింది.
వెరైటీ కథలు చేస్తాడు. కొత్తదనం చూపిస్తాడు అని ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాని.. నానిపోయిన కథలు చేస్తూ.. పాత కాలం ఫార్మేట్ ని నమ్ముకుంటే తనకొచ్చిన ఆ ఐడెంటిని, క్రేజ్ ని కోల్పోవాల్సి వచ్చింది. నాని రీసెంట్ మూవీ టక్ జగదీశ్ అనే సినిమా వచ్చే నెలలో రిలీజ్ అనుకుంటే.. ఆ సినిమాకి కావల్సిన బజ్ కానీ క్రేజ్ కానీ ఏమి రావడం లేదు. టక్ జగదీశ్ కి మినిమమ్ బజ్ రావడం లేదు. మరో పక్క టాక్సీవాలా దర్శకుడు తో చేస్తున్న శ్యామ్ సింగరాయ్ పరిస్థితి అలానే ఉంది.
ఇక నుండి అయినా నాని కేర్ ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు కూడా టక్ జగదీశ్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలతో బిజీగానే ఉన్నాడు నాని. అవి ఎలాంటి కథలను చూజ్ చేసుకున్నాడో కానీ.. ఇకనుండైనా ట్రాక్ మార్చి కొత్త కథలతో కొత్త తరహాలో తనకున్న బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకుంటాడో? లేదూ.. తన ప్లాప్ ల పరంపరని కొనసాగిస్తాడో?నాని.. చూడాలి.