Mon Dec 23 2024 06:27:28 GMT+0000 (Coordinated Universal Time)
Nani : పవన్ కళ్యాణ్ కొడుకుని ఫాలో అవుతున్న నాని తనయుడు..
పవన్ కళ్యాణ్ కొడుకుని ఫాలో అవుతున్న నాని తనయుడు. ఏ విషయంలో తెలుసా..?
Nani : నేచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలోకి ఏ సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో కూడా సినిమాలు చేస్తూ తన మార్కెట్ ని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక నాని కెరీర్ గ్రాఫ్ ని చూస్తున్న అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా తన ఫ్యాన్స్‌ని నాని ఇలా సినిమాలతోనే కాదు తన పర్సనల్ లైఫ్ తో కూడా ఖుషి చేస్తుంటారు.
తన కొడుకు అర్జున్ తో కలిసి అల్లరి చేసే ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ.. వారిని ఖుషి చేస్తుంటారు. ప్రస్తుతం అర్జున్ వయసు ఏడేళ్లు. ఇక తాజాగా వాలెంటైన్ డే సందర్భంగా కూడా కొడుకు అర్జున్ కి సంబంధించిన ఓ వీడియోని నాని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో అర్జున్.. పియానో వాయిస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు అర్జున్ టాలెంట్ చూసి తెగ సంబర పడుతున్నారు.
అయితే కొంతమంది అభిమానులు మాత్రం.. టెన్షన్ పడుతున్నారు. వారి ఆందోళనకు కారణం ఏంటంటే.. సెల్ఫ్ మేడ్ స్టార్ అయిన నాని లెగసీని ముందుకు తీసుకు వెళ్లేందుకు హీరోగా అర్జున్ ఎంట్రీ కోసం నేచురల్ స్టార్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అర్జున్ ఇప్పుడు ఇలా పియానో వాయిస్తూ కనిపించడంతో.. హీరోగా కాకుండా మ్యూజిక్ వైపు వెళ్తాడా అనే సందేహం మొదలయింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇదే టెన్షన్ ని ఫేస్ చేస్తున్నారు. అకిరా నందన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంత ఎదురు చూస్తుంటే, తాను మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ గా షార్ట్ ఫిలిమ్స్ సంగీతం కూడా అందించేస్తున్నాడు. అంతేకాదు, ప్రస్తుతం ఫారిన్ లోని ఫిలిం స్కూల్ లో మ్యూజిక్ పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు అర్జున్ వీడియోని చూసిన కొందరు నెటిజెన్స్.. నాని కొడుకు కూడా పవన్ తనయుడిని ఫాలో అవుతున్నాడా..? అంటూ కామెంట్స్ చేసున్నారు.
Next Story