Mon Dec 23 2024 11:55:52 GMT+0000 (Coordinated Universal Time)
హిట్ 7 లో ఏడుగురు హీరోలుంటారు : నేచురల్ స్టార్ నాని
హిట్ ఫ్రాంచైజీలో 3,4,5,6,7 సినిమాలు ఉంటాయి. హిట్ 7వ పార్ట్లో అన్ని పార్టుల్లో నటించిన హీరోలు కనిపిస్తారని, వాళ్ళందర్నీ
అడివి శేష్ హీరోగా.. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా హిట్ 2. డిసెంబర్ 2న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ట్రైలర్ ను చాలా థ్రిల్లింగ్ గా కట్ చేయడంతో.. సినిమా చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. తాజాగా హిట్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా..రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. హిట్ "హిట్ కంటే హిట్ 2 సినిమా ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది. హిట్ ఫ్రాంచైజీలో 3,4,5,6,7 సినిమాలు ఉంటాయి. హిట్ 7వ పార్ట్లో అన్ని పార్టుల్లో నటించిన హీరోలు కనిపిస్తారని, వాళ్ళందర్నీ ఒక సమస్య పరిష్కారం కోసం తీసుకొస్తానని నాకు డైరెక్టర్ చెప్పాడు. ఒక నిర్మాతగా కంటే ప్రేక్షకుడిగా ఆ సినిమా కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని తెలిపారు. ఒక సినిమాలో ఇద్దరు హీరోలుంటేనే ఫ్యాన్స్ కి పండగ. అలాంటిది ఏకంగా ఏడుగురు హీరోలంటే.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఆడియన్స్ లో ఇప్పట్నుండే ఊహాగానాలు మొదలయ్యాయి.
Next Story