నాని సవాల్ కి సై అంటున్న శ్రీరెడ్డి..!
ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రేడింగ్ టాపిక్ శ్రీరెడ్డి. ఆమె హీరో నానిపై పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో నాని ఓపిక పట్టలేక నిన్న ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఆమెకు లీగల్ నోటీసులు కూడా పంపించాడు. అయితే శ్రీరెడ్డి.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల విషయంలోలానే ప్లేట్ తీప్పేస్తుంది అని భావించారు అంతా.
ఇద్దరూ ఎంతదాక తీసుకెళ్తారో...?
కానీ శ్రీరెడ్డి 'లీగల్గా ప్రొసీడ్ అవడానికి రెడీ' అంటోంది. అంతేకాదు మొన్న తన పేస్ బుక్ వాల్ పై ఇలా పోస్ట్ చేసింది. "నానికి శృంగారం అంటే ఇష్టం. నాని నువ్వు నీ కెరీర్ పైన..నీ ఫామిలీపైన ప్రామిస్ వేసి చెప్పు నువ్వు నాతో శృంగారం చేయలేదా?" అని ప్రశ్నించింది. అసలు నాకు బిగ్ బాస్ ఛాన్స్ రాకుండా చేసింది నానియే అని ఆరోపణలు చేసింది. అతనే పట్టుబట్టి తన అవకాశాన్ని చెడగొట్టాడని ఆమె ఆరోపిస్తోంది. దాంతో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నాని ఇంకా ఓపిక పట్టలేక ఆమెకు లీగల్ నోటీసులు పంపాడు. ఇలా ఇద్దరు సై అంటే సై అనుకుని దీనిని ఎంతవరకు తీసుకుని వెళ్తారో చూడాలి. బిగ్ బాస్ లో హోస్ట్ గా నాని వార్తల్లో నానుతోన్న టైమ్లో శ్రీరెడ్డి అతడిని డైరెక్ట్ గా టార్గెట్ చేయడంతో సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయింది.