Sat Dec 21 2024 13:48:22 GMT+0000 (Coordinated Universal Time)
శ్యామ్ సింగరాయ్ ను బీట్ చేసిన దసరా.. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ డీల్
ప్రస్తుతం నాని "దసరా" షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మరోసారి కీర్తి సురేష్ నటిస్తుండగా..
హైదరాబాద్ : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయాడు. గతేడాది శ్యామ్ సింగరాయ్ తో థియేటర్లో ప్రేక్షకులను అలరించిన నాని.. ఈ ఏడాది "అంటే సుందరానికి", "దసరా" వంటి రెండు డిఫరెంట్ జోనర్లతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. అంటే సుందరానికి షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. జూన్ 10వ తేదీన సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ప్రస్తుతం నాని "దసరా" షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మరోసారి కీర్తి సురేష్ నటిస్తుండగా.. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే దసరా సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో మాట్లాడి థ్రిల్ చేయబోతున్నాడు. నిర్మాతలు ఇటీవల రికార్డు ధరకు నాన్-థియేట్రికల్ డీల్ను పూర్తి చేశారు. శ్యామ్ సింగరాయ్ నాన్-థియేట్రికల్ హక్కులు రూ.35 కోట్లకు అమ్ముడుపోగా.. దసరా దానిని బీట్ చేసింది. దసరా నాన్ థియేట్రికల్ హక్కులను మేకర్స్ రూ.45 కోట్లకు అమ్మారు. నాని కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ డీల్. "దసరా" సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Next Story