రీ ఎంట్రీ భీబత్సమే!!
నారా రోహిత్ కాస్త లావుగా ఉన్నప్పటికీ.. తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలతోనే వరస సినిమాలు చేసాడు. అయితే కొన్ని కథల విషయంలో నారా రోహిత్ [more]
నారా రోహిత్ కాస్త లావుగా ఉన్నప్పటికీ.. తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలతోనే వరస సినిమాలు చేసాడు. అయితే కొన్ని కథల విషయంలో నారా రోహిత్ [more]
నారా రోహిత్ కాస్త లావుగా ఉన్నప్పటికీ.. తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలతోనే వరస సినిమాలు చేసాడు. అయితే కొన్ని కథల విషయంలో నారా రోహిత్ చేసిన తప్పిదాలు వలన వరసగా డిజాస్టర్స్ అందుకుని.. గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అయితే నారా రోహిత్ హీరో మెటీరియల్ కాదు… కానీ కథలకు అనుగుణమైన నటనతో ఆకట్టుకునేవాడు. ఇక సినిమా ఇండస్ట్రీని నారా రోహిత్ వదిలేసాడని అందరూ డిసైడ్ అయ్యారు కూడా. కానీ తాజాగా రోహిత్ ఫ్రెండ్ శ్రీ విష్ణు మాత్రం రోహిత్ రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు.
నారా రోహిత్ ప్రోద్బలంతో సినిమాల్లోకి వచ్చిన శ్రీ విష్ణు.. హీరోగా విభిన్నకథల్తో దూసుకుపోతుంటే.. రోహిత్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. నారా రోహిత్ సినిమాలు వదిలేసాడా అని శ్రీ విష్ణు ని అడిగితె… నారా రోహిత్ చేసిన కొన్ని సినిమాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దాంతో రోహిత్ సినిమాలపై పునరాలోచనలో పడ్డాడు. కొంచెం గ్యాప్ తీసుకుని సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం కథలు వింటున్న రోహిత్ త్వరలోనే మంచి సినిమాతో మీ ముందు వస్తాడు. అయితే నేను రోహిత్ కలిసి ఓ పెద్ద సినిమా చేయబోతున్నామని.. రోహిత్ రీ ఎంట్రీ బావుండాలని ఆశిస్తున్నా అన్నాడు. ఇక రోహిత్ కి నేనంటే చాలా ఇష్టం. రోహిత్ లాంటి మంచి వ్యక్తిని నేనింతవరకు చూడలేదు అంటున్నాడు. రోహిత్ లాంటి ఫ్రెండ్ ఉండడం నా అదృష్టం అంటున్నాడు శ్రీ విష్ణు..