Sun Nov 24 2024 20:49:25 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ పాడిన తెలుగు పాటలు విన్నారా..? AIతో నెటిజన్లు మీమ్స్ వైరల్..
నరేంద్ర మోదీ తెలుగు మాట్లాడడమే చాలా కష్టం. అలాంటిది ఆయనతో తెలుగు లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్..
AI టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి.. దానిని ఉపయోగించి ఏవేవో ప్రయత్నాలు, అద్భుతాలు చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాధ్యం కానిది ఏదీ లేదు. వార్తలు చదవడానికి యాంకర్ సహాయం లేకుండానే, ఈ టెక్నాలజీ.. ఒక కృత్రిమ యాంకర్ ని సృష్టించి న్యూస్ ని వ్యూయర్స్ ముందుకు తీసుకు వస్తుంది. ఇక నెటిజెన్స్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు.
తమకి నచ్చిన స్టార్స్ ని తమకి నచ్చిన క్యారెక్టర్స్ లో చూసుకోవడానికి AI సహాయం తీసుకోని దేవుళ్లుగా, మహారాజు, మహారాణిలా మార్చేస్తున్నారు. అయితే ఈసారి ఈ టెక్నాలజీని మరింత క్రియేటివ్ గా ఉపయోగించారు. ఒక పాట పాడడానికి సింగర్ లేకుండానే.. ఆ గాయకుడు వాయిస్ తో పాటలని ఆడియన్స్ కి వినిపించేస్తున్నారు. ఈక్రమంలోనే కొందరు నెటిజెన్స్.. మన దేశ ప్రధాని 'నరేంద్ర మోదీ' గొంతుని అరువు తీసుకోని కొన్ని పాటలను సృష్టిస్తున్నారు.
నరేంద్ర మోదీ తెలుగు మాట్లాడడమే చాలా కష్టం. అలాంటిది ఆయనతో తెలుగు లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ని కూడా పాడించేస్తున్నారు నెటిజెన్స్. జయం చిత్రంలోని 'రాను రానంటూనే', పుష్పలోని 'శ్రీవల్లి', బేబీ మూవీలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా', జాను సినిమాలోని 'లైఫ్ అఫ్ రామ్'.. సాంగ్స్ తో మోదీ చుట్టూ ఒక లవ్ స్టోరీని క్రియేట్ చేస్తున్నారు.
ఇటలీ ప్రధాని 'జార్జియా మెలోని', నరేంద్ర మోదీ మధ్య.. ఈ పాటలతో ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేసేశారు. ఇక ఇందుకు సంబంధించిన సాంగ్స్ అండ్ వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటి పై కొందరు మీమర్స్ మీమ్స్ చేస్తూ.. నెటిజెన్స్ ని మరింత అలరిస్తున్నారు. మరి మోదీ పాడిన ఆ తెలుగు పాటలను ఒకసారి మీరుకూడా వినేయండి.
Next Story