Mon Dec 23 2024 23:41:01 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి "మళ్లీ పెళ్లి"
సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్రా లోకేశ్ లు గత కొంత కాలంగా వార్తల్లో ఉన్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
నరేష్, పవిత్రా లోకేష్ కలిసి నటించిన మూవీ మళ్లీ పెళ్లి. థియేటర్లలో రిలీజ్ కు ముందు బాగా వార్తల్లో నిలిచినప్పటికీ.. సినిమా మొదటి ఆట నుండే ఆడియన్స్ నుండి పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. థియేటర్లలో సందడి చేయలేకపోయిన సినిమా ఓటీటీలోకి వస్తోంది. జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మళ్లీ పెళ్లి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు ఆహా లో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే ఒకే రోజు రెండు ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్రా లోకేశ్ లు గత కొంత కాలంగా వార్తల్లో ఉన్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. 60 ప్లస్ వయసులో నరేశ్ ఉండగా, 40 ప్లస్ వయసులో ఉన్న పవిత్ర కలిసి జీవిస్తున్నారు. వీరి ఇద్దరి జీవితాలలో జరిగిన ఘటనల ఆధారంగా 'మళ్లీ పెళ్లి' సినిమాను తెరకెక్కించారు. పలు వివాదాల మధ్య ఈ చిత్రాన్ని మే 26న థియేటర్లలో విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా పెద్దగా సౌండ్ చేయలేదు. నరేష్, పవిత్రా లోకేష్ జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు ఎం.ఎస్ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో శరత్‌బాబు, వనిత విజయ్‌కుమార్, జయసుధ ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను విజయకృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ మూవీని నిర్మించారు.
Next Story