Mon Dec 23 2024 13:30:39 GMT+0000 (Coordinated Universal Time)
నరేష్-పవిత్రలకు ఊహించని ఊరట
టాలీవుడ్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ చుట్టూ ఎన్నో వివాదాలు నడిచాయి. అటు కర్ణాటక లోనూ..
టాలీవుడ్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ చుట్టూ ఎన్నో వివాదాలు నడిచాయి. అటు కర్ణాటక లోనూ.. ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి బట్టల్లో కనిపించారు. పెళ్లి అయిపోయిందేమో అని అనుకోగా.. అది కేవలం సినిమా కోసమని ఆ తర్వాత షాక్ ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఇద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాను అడ్డుకోవడానికి కూడా కొందరు ప్రయత్నించారు.
‘మళ్లీ పెళ్లి’ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మించారు. నరేష్ వ్యక్తిగత జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నరేష్ రెండో భార్య రమ్య రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించగా.. సినీ నటిగా పవిత్ర లోకేశ్ నటించారు. ఈ సినిమా విడుదలకు వ్యతిరేకంగా రమ్య రఘుపతి కేసు దాఖలు చేశారు. మళ్లీ పెళ్లి సినిమాను థియేటర్లు, ఓటీటీ ప్లాట్ఫారమ్లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని రమ్య రఘుపతి బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్ లేని కారణంగా కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా రమ్య రఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది.బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా మళ్లీ పెళ్లి సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది. సినిమా కల్పితమని సెన్సార్ బోర్డు సర్టిఫై చేశాక విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు తెలిపింది.
మరో కేసుకు సంబంధించి.. రమ్య రఘుపతిని నరేష్ నానక్రామ్గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. నరేష్పై గృహ హింస కేసు, నరేష్-పవిత్రపై రమ్య రఘుపతి ఇతర కేసు వేశారు. ఆ వెంటనే నరేష్, ఆయన కుటుంబ సభ్యులు రమ్య రఘుపతిపై గృహ నిషేదం కేసు పెట్టారు. ఈ కేసును పరిశీలించిన కోర్టు నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది.
Next Story