Mon Dec 23 2024 15:53:21 GMT+0000 (Coordinated Universal Time)
నరేష్ - పవిత్ర ల "మళ్లీ పెళ్లి" రిలీజ్ డేట్ ఫిక్స్
కట్ చేస్తే.. "మళ్లీ పెళ్లి" సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రముఖ నిర్మాత, దర్శకుడైన ఎంఎస్ రాజు తీసిన..
టాలీవుడ్ నటుడు నరేష్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం వారిద్దరి రిలేషనే. నరేష్ - పవిత్ర ల రిలేషన్ గురించి అందరికీ తెలిసిపోవడంతో.. త్వరలోనే తామిద్దరం పెళ్లిచేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఓ పెళ్లివీడియోతో అందరికీ షాకిచ్చారు. నిజంగానే పెళ్లైపోయిందనుకున్నారంతా. తీరా చూస్తే అది వాళ్లిద్దరూ కలిసి నటించిన "మళ్లీ పెళ్లి" సినిమాలో సీన్.
కట్ చేస్తే.. "మళ్లీ పెళ్లి" సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రముఖ నిర్మాత, దర్శకుడైన ఎంఎస్ రాజు తీసిన సినిమా కావడంతో దానిపై కాస్త బజ్ క్రియేట్ అయింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రయూనిట్. వేసవి కానుకగా మే 26న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తమ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను రీల్పై చూపెడుతున్న ఈ జంట, ఈ సినిమాలో ఎలాంటి వివాదాలను ప్రస్తావిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ సినిమాపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
Next Story