Mon Dec 23 2024 08:52:42 GMT+0000 (Coordinated Universal Time)
"మళ్లీ పెళ్లి" సినిమాకు షాక్
మే 26న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ కు ఊహించని షాక్ తగిలింది.
సీనియర్ నటుడు నరేష్ - పవిత్ర లోకేశ్ జంటగా.. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "మళ్లీ పెళ్లి". మే 26న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. సినిమా విడుదలను ఆపాలంటూ నరేష్ మూడవ భార్య రమ్య రఘువతి కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. "మళ్లీ పెళ్లి" సినిమాలో తన ప్రతిష్టను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. రమ్య పిటిషన్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియాల్సి ఉంది.
కాగా.. నరేష్ - పవిత్ర లోకేశ్ జీవితాల్లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా "మళ్లీ పెళ్లి" సినిమాను తీశారు. వరుస ప్రమోషన్లతో, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో అన్నపూర్ణ, శరత్ బాబు, జయసుధ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండబోతోందో చూపించేశారు. నరేష్ - పవిత్ర ల జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏంటి ? వాళ్లిద్దరు ఎలా కలుసుకున్నారు ? రియల్ లైఫ్ లో నెక్ట్స్ ఏం చేయబోతున్నారో ఈ సినిమాలో చూపించారా ? అన్న ఆసక్తికర పాయింట్స్ తో ట్రైలర్ కట్ చేశారు.
Next Story