Mon Dec 23 2024 10:48:29 GMT+0000 (Coordinated Universal Time)
68వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవం.. వివరాలివే
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా ఎంపికైన సూర్యతో పాటు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ (తానాజీ) కూడా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. నాట్యం సినిమాకు రెండు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. కొరియోగ్రఫీ (సంధ్యారాజు) పాటు మేకప్ (టీవీ రాంబాబు) విభాగాల్లో నాట్యం సినిమా అవార్డులను దక్కించుకుంది. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫొటో ఎంపిక కాగా... తెలుగు ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ (అల వైకుంఠపురంలో) ఎంపికయ్యారు.
ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): - తమన్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : జీవీ ప్రకాశ్ కుమార్ (సూరరై పోట్రు -తమిళ్)
బెస్ట్ స్టంట్స్ - అయ్యప్పనుమ్ కోషియమ్
ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం -తెలుగు)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: టీవీ రాంబాబు - నాట్యం
ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ (తమిళ్)
ఉత్తమ మలయాళ చిత్రం: థింకలియా నిశ్చయమ్
ఉత్తమ కన్నడ చిత్రం: డొల్లు
ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): అయ్యప్పనుమ్ కోషియమ్ (మలయాళం)
ఉత్తమ లిరిక్స్: సైనా(హిందీ) - మనోజ్ ముంతషిర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నచికెత్ బర్వె, మహేశ్ షెర్లా (తానాజీ: ది అన్సంగ్ వారియర్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీస్ నాడోడి (కప్పేలా -మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ -తమిళ్)
మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ - మధ్యప్రదేశ్
నాన్ ఫీచర్ ఫిలింస్
బెస్ట్ వాయిస్ ఓవర్: శోభా రాప్సోడీ ఆఫ్ రెయిన్స్- మాన్సూన్స్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: విశాల్ భరద్వాజ్ (1232 కి.మీ: మరేంగే తో వహీన్ జాకర్) (హిందీ)
బెస్ట్ ఎడిటింగ్: అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్)
బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్- సందీప్ భాటి, ప్రదీప్ లెహ్వార్ (జాదూయ్ జంగల్) (హిందీ)
బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): అజిత్ సింగ్ రాథోడ్ (పర్ల్ ఆఫ్ ద డిసర్ట్ ) (రాజస్థానీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: నిఖిల్ ఎస్ ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప) (మలయాళం)
ఉత్తమ డైరెక్షన్: ఆర్వీ రమణి (ఓ దట్స్ భాను- ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హిందీ)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్ (మరాఠి)
ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: కచీచినుతు (అస్సాం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: అడ్మిటెడ్ (హిందీ, ఇంగ్లీష్)
బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: ద సేవియర్: బ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ (పంజాబీ)
బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: వీలింగ్ ద బాల్ (ఇంగ్లీష్, హిందీ)
బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్ (మలయాళం )
బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: జస్టిస్ డిలేయ్డ్ బట్ డెలివర్డ్ (హిందీ), 3 సిస్టర్స్ (బెంగాలీ)
బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మాన అరు మానుహ్ (అస్సామీస్)
బెస్ట్ ప్రొమోషనల్ ఫిలిం: సర్‌మొంటింగ్ చాలెంజెస్ (ఇంగ్లీష్)
Next Story