Mon Nov 18 2024 05:57:19 GMT+0000 (Coordinated Universal Time)
99 రూపాయలకే సినిమాలు చూసేయొచ్చు
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అక్టోబరు 13వ తేదీని జాతీయ సినిమా
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అక్టోబరు 13వ తేదీని జాతీయ సినిమా దినోత్సవంగా నిర్ణయించింది. సినిమా ఔత్సాహికుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో ప్రవేశానికి రూ.99 మాత్రమే వసూలు చేయనున్నట్లు జాతీయ మల్టీప్లెక్స్ ట్రేడ్ బాడీ తాజాగా పత్రికా ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 13న జాతీయ సినిమా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) ప్రకటించింది. PVR INOX, Cinepolis, Miraj, Delite సహా భారతదేశంలోని మల్టీప్లెక్స్లలో 4,000 స్క్రీన్లు జాతీయ సినిమా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ సినిమా హాళ్లలో ఆరోజు 99 రూపాయలకే సినిమాలను చూసేయొచ్చు.
ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో మళ్లీ థియేటర్లు కళకళలాడుతూ ఉన్నాయి. మల్టీప్లెక్స్ సంస్థలు కూడా ప్రేక్షకుల రాకను కంటిన్యూ చేయడానికి చాలా ఆఫర్లని అందిస్తూ ఉన్నాయి. ఇక జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా ఆనందాన్ని పొందేందుకు అన్ని వయసుల ప్రేక్షకులకు ఆహ్వానం పలకనున్నారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, సినీ ప్రేక్షకులు అక్టోబర్ 13న రిక్లైనర్, ప్రీమియం ఫార్మాట్లను మినహాయించి రూ.99 చెల్లించి ఏ సినిమా అయినా చూడవచ్చు.
Next Story