Mon Dec 23 2024 10:25:16 GMT+0000 (Coordinated Universal Time)
నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
ఈ మాస్ యాంథమ్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో విడుదలై గంటైనా అయిందో లేదో.. అప్పుడే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం రూ.1000 కోట్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ లో రామ్-భీమ్ ల నటనను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. ముఖ్యంగా నాటు నాటు పాటలో.. ఇద్దరు స్టార్ హీరోలు.. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లు ఒకే ఫ్రేమ్ లో నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు కూడా ఊగిపోయారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ మాస్ యాంథమ్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో విడుదలై గంటైనా అయిందో లేదో.. అప్పుడే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాటలో తారక్ - చరణ్ ల డ్యాన్స్ చూస్తూ ప్రేక్షకులు మైమరిచి పోతారంటే అతిశయోక్తి కాదు. బ్రిటిష్ వారి ముందు తెలుగు నాటును చూపించి మెప్పించారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పాటకోసం చాలా కష్టపడినట్లు తెలిపారు రాజమౌళి. ఈ పాటమొత్తాన్ని ఉక్రెయిన్ లోనే చిత్రీకరించినట్లు కూడా తెలిపారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
Next Story