Sat Dec 21 2024 02:25:56 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్బాస్ నుంచి పావని, శివాజీ అవుట్..
ఆరో వారం ఎలిమినేషన్, రీ ఎంట్రీతో పాటు చాలా జరిగాయి.
తెలుగు బిగ్బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అంటూ చాలా ఇంటరెస్టింగా సాగుతుంది. ఆరో వారం కూడా పూర్తి చేసుకొని ఏడో వారంలోకి అడుగు పెట్టేసింది. ఇక గత ఐదు వారలు మాదిరి ఈ వారం కూడా లేడీ కంటెస్టెంటే బయటకి వచ్చింది. ఆరో వారం నామినేషన్స్ లో శోభా శెట్టి, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తి, ప్రిన్స్ యావర్, అమర్దీప్, టేస్టీ తేజ ఉన్నారు. వీరిలో శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యి బయటకి వస్తుందని అందరూ భావించారు.
కానీ గత వారమే వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఎలిమినేట్ అవ్వడం అందరికి షాక్ కి గురి చేసింది. ఇక నయని పావని కూడా.. తను బాగా ఆడుతున్నా బిగ్బాస్ ఎందుకు ఎలిమినేట్ చేశాడంటూ ప్రశ్నిస్తూ బయటకి వచ్చేసింది. ఇది ఇలా ఉంటే.. ఆల్రెడీ హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసిన సింగర్ దామిని, రతిక, శుభ శ్రీ మళ్ళీ తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఒకరు మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారని బిగ్బాస్ తెలియజేశాడు.
ఇక ఈ ముగ్గురికి హౌస్ లో ఓటింగ్ పెట్టారు. ఇంటిలోని కంటెస్టెంట్స్ అంతా తమ ఫేవరెట్ ప్లేయర్ కి ఓటులు వేశారు. అయితే ఈ ఓటింగ్ అయిన తరువాత బిగ్బాస్ ఒక షాక్ ఇచ్చాడు. వీరిలో ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో.. వారినే లోపాలకి వస్తారని చెప్పాడు. ఇక ఈ ఓటింగ్ రిజల్ట్ వచ్చే శనివారం తెలియజేస్తాను అంటూ వెల్లడించాడు. వచ్చే వారం సింగర్ దామిని, రతిక, శుభ శ్రీ.. ముగ్గురిలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
కాగా ఆదివారం ఎపిసోడ్ పూర్తి అయిన తరువాత సోమవారంకి సంబంధించిన ప్రోమోని చూపించారు. ఈ ప్రోమోలో శివాజీ ఇంటి నుంచి బయటకి వచ్చేస్తున్నట్లు చూపించారు. శివాజీ గత కొన్ని రోజులుగా బుజం నొప్పితో బాధ పడుతుంది. ఈ చికిత్స కోసమే బయటకి వచ్చినట్లు తెలుస్తుంది. మళ్ళీ కొన్ని రోజులు తరువాత రీ ఎంట్రీ ఇవ్వొచ్చు. గతంలో బిగ్బాస్-3లో కూడా నూతన్ నాయుడు కంటెస్టెంట్ కి గాయం అయినప్పుడే.. ఇలాగె బయటకి తీసుకు వెళ్లి మళ్ళీ లోపాలకి తీసుకు వచ్చారు.
Next Story