Sun Dec 22 2024 22:56:14 GMT+0000 (Coordinated Universal Time)
నయన్ వివాహం రేపే.. సూపర్ ప్లాన్
నయనతార - విష్నేష్ శివ రేపు వివాహం చేసుకుంటున్నారు. రేపు మహాబలిపురంలో వారి వివాహ వేడుక జరగనుంది
నయనతార - విష్నేష్ శివ రేపు వివాహం చేసుకుంటున్నారు. రేపు మహాబలిపురంలో వారి వివాహ వేడుక జరగనుంది. ఈ వేడుకకు పలువురు సీనీ ప్రముఖులు హాజరవుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా విష్నేష్ శివన్ ఉన్నారు. అలాగే నయనతార ఇప్పటికీ హీరోయిన్ గా పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఎప్పటి నుంచో వీరి వివాహం జరుగుతుందని వదంతులు వస్తున్నాయి. ఇప్పటికి అనేక సార్లు వార్తలు వచ్చినా అది నిజం కాలేదు.
స్పెషల్ డ్రెస్ కోడ్....
కానీ రేపు మాత్రం ఇద్దరూ ఒక్కటవుతున్నారు. ఈ విషయాన్ని విష్నేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్యులను మాత్రమే ఆహ్మానించారు. ఇక నయనతార - శివన్ వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ వీడియో రూపంలో రూపొందించారు. ఇప్పటికే ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేడుకకు వచ్చే అతిధులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ధరించి రావాలని చెప్పినట్లు కూడా తెలిసింది. మొత్తం మీద సుదీర్ఘకాలం తర్వాత నయన్ - విష్నేష్ శివన్ లు రేపు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Next Story