Mon Dec 23 2024 15:26:38 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నయన్-విఘ్నేశ్
త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోబోతున్నట్లు మరో వార్త వైరల్ అవుతోంది. ప్రేమ పక్షులు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని పెద్దఎత్తున
తిరుపతి : దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ లు చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ లవ్ బర్డ్స్ ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతారా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరికీ పెళ్లైపోయిందంటూ.. కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఓ ఆలయానికి వెళ్లిన ఈ జంట.. నయన్ నుదిటిన సింధూరం పెట్టుకోవడంతో పెళ్లైపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి కానీ.. ఇటు నయన్, అటు విఘ్నేశ్ ఈ రూమర్లపై స్పందించలేదు. తాజాగా మరోసారి వారి పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది.
త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోబోతున్నట్లు మరో వార్త వైరల్ అవుతోంది. ప్రేమ పక్షులు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల తిరుమలకు విచ్చేసిన నయన్ -విఘ్నేశ్ లు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తమ పెళ్లి ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది. వివాహ వేదికను కూడా పరిశీలించారని టాక్. అంతా బాగుంటే జూన్ 9న తిరుమలలో వీరు పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. ఈపెళ్లి వార్తలపై నయన్ - విఘ్నేశ్ లు స్పందించాల్సి ఉంది.
Next Story