నయన్ నిజంగా ఇంత తీసుకుంటుందా
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అంటే వెంటనే మనం నయనతార పేరు చెప్పేస్తాం. ఎందుకంటే ఆమె అటువంటి సినిమాలు చేసి అంతటి యాక్టింగ్ చేసి అందరిని [more]
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అంటే వెంటనే మనం నయనతార పేరు చెప్పేస్తాం. ఎందుకంటే ఆమె అటువంటి సినిమాలు చేసి అంతటి యాక్టింగ్ చేసి అందరిని [more]
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అంటే వెంటనే మనం నయనతార పేరు చెప్పేస్తాం. ఎందుకంటే ఆమె అటువంటి సినిమాలు చేసి అంతటి యాక్టింగ్ చేసి అందరిని ఫిదా చేసింది కాబట్టి. కెరీర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాలు చేసిన నయన్ వెంటనే స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి వసూళ్లు రాబట్టింది.
ఆమంటే అంతా క్రేజ్….
నయనతారతో సినిమా అంటే ప్రొడ్యూసర్స్ ఏమి ఆలోచించకుండా భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆమె క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ప్రొడ్యూసర్స్. ప్రస్తుతం ఆమె సినిమాకి ఆరుకోట్ల రూపాయలు తీసుకుంటుంది. అయినా కానీ ప్రొడ్యూసర్స్ తగ్గడంలేదు. ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికైనా సై అంటున్నారు. కాకపోతే నయన్ ఈ భారీ రెమ్యూనరేషన్లను కేవలం బయటి భాషల సినిమాలకే తీసుకుంటోంది. ఆమె సొంత భాష అయినా మలయాళంలో ఇంత తీసుకోవడంలేదు. బయట భాషలతో పోల్చుకుంటే చాలా తక్కువ తీసుకుంటుందని టాక్.
ఆ వయస్సులోనూ తగ్గని ఛాయ
రీసెంట్ గా ఆమె చేస్తున్న సినిమాలు ‘సైరా నరసింహారెడ్డి’, రజనీకాంత్ ‘దర్బార్’ సినిమాలకు ఆమె 6 కోట్లు తీసుకుందని తెలుస్తుంది. హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాకా.. కొన్ని సినిమాలకు కోటిరూపాయల పారితోషకాన్ని తీస్తుంటే ఇప్పుడు రిటైర్ అయ్యే టైములో 6 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం విడ్డూరమే.