Fri Dec 20 2024 20:29:58 GMT+0000 (Coordinated Universal Time)
'అంటే .. సుందరానికీ' నుంచి నజ్రియా ఫస్ట్ లుక్.. అలా ఎలా కుదిరిందబ్బా ?
తాజాగా 'అంటే .. సుందరానికీ' నుంచి నజ్రియా లుక్ తో పాటు ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్, చిన్న వీడియోను రిలీజ్
హైదరాబాద్ : వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా 'అంటే .. సుందరానికీ'. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన నజ్రియా ఫహద్ నటించి, తొలిసారి తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్ గా పరిచయం అవుతుంది. అంతకుముందు రాజా రాణి సినిమాతో నజ్రియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే అయినా.. పూర్తి తెలుగులో నజ్రియా నటిస్తున్న మొదటి సినిమా ఇదే. తాజాగా 'అంటే .. సుందరానికీ' నుంచి నజ్రియా లుక్ తో పాటు ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్, చిన్న వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
నజ్రియా లీలా థామస్ గా కనిపిస్తుంది. సుందరం సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆచార, వ్యవహారాలతో సతమతమయ్యే జీవితం. అలాంటి సుందరం జీవితంలోకి మోడ్రన్ గా ఉన్న లీలా థామస్ ఎలా ఎంట్రీ ఇచ్చింది. వారిద్దరి కలయిక సుందరం జీవితాన్ని ఎలా మారుస్తుందనేది కథ. 'అంటే .. సుందరానికీ' సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. జూన్ 10వ తేదీన 'అంటే .. సుందరానికీ' థియేటర్లలో విడుదల కానుంది.
Next Story