Mon Dec 23 2024 07:47:56 GMT+0000 (Coordinated Universal Time)
నేలకొండ భగవంత్ కేసరి.. ఈపేరు చానా యేండ్లు యాదుంటాది
హైదరాబాద్ లోని శ్రీ భ్రమరాంబ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ..భగవంత్ కేసరి టీజర్ ను చిత్రయూనిట్ లాంచ్ చేసింది.
అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ లో NBK108 వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రెండ్రోజుల క్రితమే సినిమా టైటిల్ ను ప్రకటించారు. ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేసింది టీమ్. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. టీజర్లో బాలయ్య డైలాగ్ లు ఎప్పటిలాగే పవర్ఫుల్ గా ఉన్నాయి. ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేశారు. బాలయ్య 108 సినిమా కావడంతో 108 థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
హైదరాబాద్ లోని శ్రీ భ్రమరాంబ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ..భగవంత్ కేసరి టీజర్ ను చిత్రయూనిట్ లాంచ్ చేసింది. నిర్మాతలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీజర్ రిలీజైన థియేటర్లలో బాలయ్య అభిమానులు సందడి చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ నటిస్తుండగా శ్రీలీల, శరత్ కుమార్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
టీజర్ చూస్తే.. సినిమాను తెలంగాణ యాసలో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. తెలంగాణ యాస, హిందీ భాషలో బాలయ్య చెప్పిన డైలాగ్ లు అలరించాయి. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. అడవిబిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు చానా యేండ్లు యాదుంటది అని ఆఖర్లో చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Next Story