Mon Dec 23 2024 12:01:17 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్య సినిమా.. కొండారెడ్డి బురుజు.. లింకేమిటో..?
గోపిచంద్ మలినేని.. నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి.. చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ ప్రకటించింది. ఈ సినిమా టైటిల్‌ను అక్టోబర్ 21న రివీల్ చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను కర్నూల్లోని కొండా రెడ్డి బురుజు దగ్గర లాంచ్ చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. టాలీవుడ్ చరిత్రలో టైటిల్ లోగో లాంచ్ కోసం ప్రోగ్రామ్ చేయడం అనేది ఇదే మొదటిసారని చిత్ర బృందం చెబుతోంది. ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజును ఎంచుకున్నారంటే.. సినిమాలో ఆ బ్యాగ్డ్రాప్ లో మంచి సీన్స్ పడ్డట్టే ఉన్నాయని అభిమానులు భావిస్తూ ఉన్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని సమాచారం.అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ చేస్తోన్న సినిమా కావడం.. అలాగే క్రాక్‌తో బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాలు భారీ ఉన్నాయి. NBK 107 ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించి.. నైజాంలో రూ.20 కోట్లు, సీడెడ్‌లో రూ.14 కోట్లు, ఆంధ్రలో రూ.35 కోట్లు ఉందని అంటున్నారు. ఓవర్ సీస్‌కు కలుపుకుని NBK 107 మూవీ థియేట్రికల్ బిజినెస్‌ను రూ.80 కోట్లకు ఉంటుందని తెలుస్తోంది. ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఇదే హయ్యస్ట్ థియేట్రికల్ బిజినెస్ అవుతుందని అంటున్నారు. అఖండ ఇచ్చిన హోప్ తో భారీగా బిజినెస్ జరుగుతూ ఉంది.
Next Story