Mon Dec 23 2024 04:07:35 GMT+0000 (Coordinated Universal Time)
ఊచకోత షురూ.. NBK108 టైటిల్ ఇదే..
జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. రెండ్రోజుల ముందే చిత్రబృందం టైటిల్ ను, పోస్టర్ ను అధికారికంగా విడుదల..
నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం NBK108. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. రెండ్రోజుల ముందే చిత్రబృందం టైటిల్ ను, పోస్టర్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తాజాగా ట్విట్టర్ లో సినిమా పేరుతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.
‘అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ ’ అనే శీర్షికతో సినిమా టైటిల్ ను ప్రకటించారు. టైటిల్ పవర్ఫుల్ గా ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి లతో వరుస హిట్స్ కొట్టిన బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫ్యామిలీ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అనిల్ రావిపూడి ఈసారి భిన్నంగా బాలయ్యతో పక్క మాస్ సినిమా చేస్తుండటంతో సాధారణంగానే అంచనాలు నెలకొన్నాయి. ‘భగవంత్ కేసరి’ లో కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Next Story