Sun Dec 22 2024 15:52:55 GMT+0000 (Coordinated Universal Time)
వేలాది విద్యార్థుల మధ్య వాల్తేరు వీరయ్య నుండి "నీకేమో అందమెక్కువా సాంగ్"..
తాజాగా.. ఈ సినిమా నుండి "నీకేమో అందమెక్కువా సాంగ్"ను విడుదల చేశారు. ఈ ఐదోపాటను మల్లారెడ్డి కళాశాలలో..
మెగాస్టార్ చిరంజీవి - శృతిహాసన్ జంటగా నటిస్తోన్న సినిమా వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్, కీలకపాత్రలో మాస్ మాహారాజా రవితేజ నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా.. మరో రెండు రోజుల్లో అంటే జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా.. ఈ సినిమా నుండి "నీకేమో అందమెక్కువా సాంగ్"ను విడుదల చేశారు. ఈ ఐదోపాటను మల్లారెడ్డి కళాశాలలో.. వేలాదిమంది విద్యార్థుల మధ్య జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సినిమా బృందం నీకేమో అందమెక్కువ పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాబి, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్, ప్రొడ్యూసర్ రవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులతో కలిసి వాల్తేరు వీరయ్య పాటలకు చిత్రబృందం.. విద్యార్థులతో కలిసి స్టెప్పులేసింది. 13న థియేటర్లలో విడుదలవుతున్న సినిమాని ప్రతిఒక్కరూ చూడాలని కోరింది.
Next Story