నేల టికెట్ ని నేల నాకించేసిన అమ్మమ్మ
రవితేజ - కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేలటిక్కెట్టు సినిమాకి ఓవరాల్ గా ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి ఫెయిల్ మార్కులే పడ్డాయి. నేలటిక్కెట్టు టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా చౌకబారుగా ఉందని.. కళ్యాణ్ కృష్ణ ఇలాంటి కంటెంట్ తో ఎలా నేలటిక్కెట్టుని తెరకెక్కించాడని.. అలాగే రవితేజ పెరఫార్మెన్స్ బావున్నప్పటికీ.. కేరెక్టరైజేషన్ అస్సలు బాగోలేదని విమర్శలొస్తున్నాయి. అలాగే రవితేజ పక్కన హీరోయిన్ మాళవిక అస్సలు సూట్ కాలేదని, మ్యూజిక్ సినిమాకే అతి పెద్ద మైనస్ అని ఇలా అనేక రకాల మైనస్ పాయింట్స్ తో నేలటిక్కెట్టు సినిమాకి ప్లాప్ టాక్ వచ్చేసింది. ఇక నేలటిక్కెట్టు కోసం దర్శకుడు, హీరో రవితేజ, హీరోయిన్ మాళవికలు తమ శక్తిమేర పబ్లిసిటీ చేశారు. గత వారం రోజులుగా నేలటిక్కెట్టు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ తెగ హడావిడి చేశారు.
పబ్లిసిటీ లేకపోయినా...
అయితే నేలటిక్కెట్టుకి పోటీగా నిన్ననే ఏ మాత్రం అంచనాలు, పబ్లిసిటీ లేకుండా సైలెంట్ గా థియేటర్స్ లోకి దిగిన నాగ శౌర్య అమ్మగారిల్లు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓయ్ హీరోయిన్ షాలిని హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా అందరిని ఆకట్టుకునేలా ఉందని... నాగ సౌర్య సెటిల్డ్ పెరఫార్మెన్స్ తో పాటుగా షాలిని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని. అంటున్నారు. అలాగే ఈ సినిమాకి పట్టుకొమ్మ లాంటి నటనతో రావు రమేష్ ఆకట్టుకున్నాడని, ఇంకా సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులకు బాగా చేరుతుందని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగా ఆకట్టుకునే ఉంటుందని ప్రశంసలొస్తున్నాయి. అలాగే సినిమాలోని డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. మరి ఈ సినిమాకి మాంచి పబ్లిసిటీ ఉన్నట్లయితే ఇంకా మంచి హిట్ అయ్యేదని.. కేవలం పబ్లిసిటీ లేకపోవడం సినిమాకి అతి పెద్ద మైనస్ అన్నట్లుగా చెబుతున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న నాగశౌర్య..
ఏది ఏమైనా పబ్లిసిటి లేకపోతేనేమి అమ్మగారిల్లు నేలటిక్కెట్టు సినిమాని అందులో ఉన్న డైలాగ్ వలే నేల నాకించెయ్యడం ఖాయమంటున్నారు. అమ్మగారిల్లుకి నేలటిక్కెట్టు సినిమాకి చాలా డిఫ్రెన్సెస్ ఉన్నాయని.. నేల టిక్కెట్టు మాస్ ని టార్గెట్ చేస్తే... అమ్మగారిల్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చెయ్యడం వల్లనే హిట్ అయ్యిందని.. ఈ రకంగా రవితేజ మీద నాగ శౌర్య పై చెయ్యి సాధించాడంటున్నారు.