Fri Nov 29 2024 11:52:58 GMT+0000 (Coordinated Universal Time)
నేనొక నటుడ్ని.. అల్ప సంతోషిని : చిరంజీవి రంగమార్తాండ షాయరీ
నేనొక నటుడ్ని, దేవుడ్ని, జీవుడ్ని, నవ్విస్తా, ఏడిపిస్తా, ఆప్తుడిని, దాసుడిని, అల్పసంతోషిని అంటూ.. చిరంజీవి నోట వచ్చిన..
చిరంజీవి.. ఏ ముహూర్తాన శివశంకర వరప్రసాద్ నుండి చిరంజీవిగా ఆయన పేరు మారిందో గానీ.. సినిమాల్లో నటిస్తున్నారనేకంటే.. జీవిస్తున్నారని చెప్పాలి. ఆరుపదుల వయసులోనూ సినిమాల్లో నటన, డాన్సులు చేయడం ఆయనకే చెల్లు. నటనలోనే కాదు.. తన మాటలతోనూ.. చిరంజీవి భావోద్వేగాలను పలికించగలరనేందుకు రంగమార్తాండ షాయరీ ఉదాహరణ. 'నేనొక నటుడ్ని' అంటూ 'రంగమార్తాండ' కోసం 'షాయరీ'లో చిరంజీవి పలికించిన భావోద్వేగం ఎవరినైనా అద్భుత పరుస్తుంది.
నేనొక నటుడ్ని, దేవుడ్ని, జీవుడ్ని, నవ్విస్తా, ఏడిపిస్తా, ఆప్తుడిని, దాసుడిని, అల్పసంతోషిని అంటూ.. చిరంజీవి నోట వచ్చిన ఆ షాయరీకి ఇళయరాజా సంగీతం భావోద్వేగాన్ని పలికించింది. మరాఠీలో అద్భుత విజయం సాధించిన నటసామ్రాట్ సినిమాకు రీమేక్‌గా దర్శకుడు కృష్ణవంశీ తెలుగులో రంగమార్తాండను చిత్రీకరిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి చిరంజీవి షాయరీ అందించారు. ఈ షాయరీ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. లక్ష్మీభూపాల అక్షరానికి, చిరంజీవి గాత్రం తోడై వచ్చిన ఈ షాయరీ ప్రశంసలు అందుకుంటోంది. ఓసారి మీరూ లుక్కేయండి.
Next Story