Tue Dec 24 2024 01:53:20 GMT+0000 (Coordinated Universal Time)
విడుదలకు ముందే.. భారీ ధరకు "గాడ్ ఫాదర్" డిజిటల్ రైట్స్..
గాడ్ ఫాదర్ ఇంకా థియేటర్లలో విడుదల కాకుండానే.. భారీ ధరకు ఓ ఓటీటీ సంస్థ డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన తాజా సినిమా గాడ్ ఫాదర్. గతంలో చిరంజీవి నటించిన ఆచార్య.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ.. ఈ సినిమాపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. గాడ్ ఫాదర్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తవగా.. దసరా పర్వదినం రోజు అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.
మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గాడ్ ఫాదర్ ఇంకా థియేటర్లలో విడుదల కాకుండానే.. భారీ ధరకు ఓ ఓటీటీ సంస్థ డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ రూ. 57 కోట్లు చెల్లించి గాడ్ ఫాదర్ తెలుగు, హిందీ వెర్షన్ల డిజిటల్ రైట్స్ ను పొందినట్లు తెలుస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసే పనిలో పడింది. అనంతపురం వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. కానీ.. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు చిత్రయూనిట్.
Next Story