Mon Dec 23 2024 15:23:26 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ యూజర్లకు షాక్.. నెట్ ఫ్లిక్స్ సంచలన నిర్ణయం
కాగా.. ప్రయాణాల సమయంలోనూ నెట్ ఫ్లిక్స్ చందాదారుల కుటుంబ సభ్యులు ఓటీటీ సదుపాయం పొందొచ్చని తెలిపింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ భారత్ యూజర్లకు షాకిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో చెప్పినట్లుగానే భారత్ లో పాస్ వర్డ్ షేరింగ్ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కుటుంబ సభ్యులు మాత్రమే యూజర్ పాస్ వర్డ్ ఉపయోగించుకునే వీలుంటుందని తెలుపుతూ.. యూజర్లకు నెట్ ఫ్లిక్స్ మెయిల్స్ పంపింది. ఫ్యామిలీ మెంబర్స్ (Single Household) కాకుండా.. ఇతరులకు పాస్ వర్డ్ షేర్ చేస్తే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కస్టమర్ల అభిరుచి మేరకు సంస్థ పెద్దమొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీ షోలు, కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.
కాగా.. ప్రయాణాల సమయంలోనూ నెట్ ఫ్లిక్స్ చందాదారుల కుటుంబ సభ్యులు ఓటీటీ సదుపాయం పొందొచ్చని తెలిపింది. ప్రొఫెల్ బదిలీ, యాక్సెస్, డివైజెస్ మ్యానేజ్ చేయడం వంటి ఫీచర్ల ప్రయోజనాన్ని పొందవచ్చని చెప్పింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఆదాయం తగ్గడంతో.. కొత్త ఆదాయ మార్గాలను పెంచుకునే వాటిలో భాగంగానే.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా మొత్తం 100కు పైగా దేశాల్లో పాస్ వర్డ్ షేరింగ్ పై నిబంధనలు విధించింది. తాజాగా అదే విధానాన్ని భారత్ లోనూ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంతో 60 లక్షల మంది కొత్త యూజర్లు చేరినట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పుడు 238 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ తో 1.5 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ తెలిపింది.
Next Story