Mon Dec 23 2024 08:53:20 GMT+0000 (Coordinated Universal Time)
సర్ ప్రైజ్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్.. తెలుగు వెబ్ సిరీస్ లో జాన్వీ ?
పాన్ ఇండియా రేంజ్ లో ఈ సిరీస్ పలు భాషల్లో విడుదల కాబోతోంది. వెంకటేష్, రానా కలిసి రానా నాయుడు అనే సిరీస్ లో నటిస్తున్న..
అలనాటి అందాల తార, అతిలోక సుందరిగా పేరొందిన దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సౌత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. శ్రీదేవి ఫ్యాన్స్ అంతా జాన్వీ ఎప్పుడెప్పుడు సౌత్ లో సినిమాలు చేస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూశారు. తాజాగా మార్చి 6న జాన్వీ పుట్టినరోజు సందర్భంగా NTR 30 టీం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. NTR30 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంతలోనే నెట్ ఫ్లిక్స్ మరో సర్ ప్రైజ్ ఇచ్చింది.
సోమవారం సాయంత్రం.. జాన్వీ కపూర్ రానా నాయుడు సిరీస్ లో కనిపించబోతున్నట్లు ప్రకటించింది. వెంకటేష్, రానా కలిసి రానా నాయుడు అనే సిరీస్ లో నటిస్తుండగా.. మార్చి 10న ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సిరీస్ పలు భాషల్లో విడుదల కాబోతోంది. వెంకటేష్, రానా కలిసి రానా నాయుడు అనే సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా.. రానా నాయుడు నుంచి ఓ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. జాన్వీకి ఏదో ప్రాబ్లమ్ వస్తే రానా వచ్చి హెల్ప్ చేసినట్టు ఈ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమో కొంచెం కామెడిగానే ఉంది. దీంతో ఇది రానా నాయుడు ప్రమోషన్స్ కోసం చేశారా? లేక నిజంగానే జాన్వీ రానా నాయుడు సిరీస్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనుందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఏదేమైనా జాన్వీ ఎన్టీఆర్ సరసన కనిపించడానికంటే ముందు.. రానాతో కలసి రానానాయుడి కోసం నటించింది.
Next Story