Mon Dec 23 2024 03:47:06 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ట్వీట్ తో రాహుల్ రామకృష్ణపై నెటిజన్లు ఫైర్
సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియోను రాహుల్ రామకృష్ణ..
నిన్న రాత్రి ఒడిశాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇంకా ఎంతమంది మరణించారన్న దానిపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం 278 మంది మరణించగా.. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం పై యావత్ దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ప్రమాదంకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ విమర్శలకు దారితీసింది.
సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియోను రాహుల్ రామకృష్ణ షేర్ చేశాడు. దాంతో నెటిజన్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది కుటుంబాలు రైలు ప్రమాదంలో సమాధి అవ్వగా.. వేల మంది తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలవ్వడం మీకు కామెడీగా ఉందా ? ఇలాంటి సమయంలో రైలు విన్యాసాలను షేర్ చేస్తున్నారేంటి ? అని నెటిజన్లు రాహుల్ పై మండిపడ్డారు. నెటిజన్ల ఆగ్రహానికి గురైన రాహుల్.. వెంటనే ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశాడు.
ఇంతకుముందు చేసిన ట్వీట్ పై క్షమాపణలు కోరుతున్నాను. ప్రామిస్ గా ఆ రైలు ప్రమాదం గురించి, ఆ విషాదం గురించి నాకసలు ఏమీ లేదు. అర్థరాత్రి నుండీ స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉండి ఏ వార్తలు చూడలేదు. అందుకే తప్పు జరిగింది. అని ట్వీట్ చేయగా.. ఓ నెటిజన్ మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. మిమ్మల్ని ట్రోల్ చేయాలనుకోలేదు. కానీ ఆ ప్రమాదంపై సమాచారం ఇవ్వాలనుకున్నాను అని రిప్లై ఇచ్చాడు. నన్ను అలర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ రాహుల్ ఆ నెటిజన్ కు రిప్లై ఇచ్చాడు.
Next Story