Mon Dec 23 2024 09:05:45 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లికి ముందే ఆ హీరోయిన్ కూడా ప్రెగ్నెంట్ అయిందా ?
ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. "ముందు ప్రెగ్నెంట్.. ఆ తర్వాత పెళ్లి.. ఇప్పుడు బాలీవుడ్ లో..
బాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్ల పెళ్లిళ్లపై ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కమాల్ R ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. "ముందు ప్రెగ్నెంట్.. ఆ తర్వాత పెళ్లి.. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే కొత్త ట్రెండ్. ఇటీవల జరిగిన పెళ్లిళోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయినట్లు సమాచారం. మంచిది" అంటూ కమాల్ R ఖాన్ ట్వీట్ చేశారు. కాగా.. ఇటీవల బాలీవుడ్ లో జరిగిన పెళ్లి అంటే.. కియారా-సిద్ధార్థ్ లదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీ పని మీరు చూసుకోకుండా ఇలా ప్రతి ఒక్కరిపై కామెంట్స్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
కాగా.. ఫిబ్రవరి 7న సిద్ధార్థ్-కియారా ల వివాహం రాజస్థాన్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆ తర్వాత ఈ కొత్తజంట.. రెండు ప్రాంతాల్లో గ్రాండ్ గా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి, రిసెప్షన్ లకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది ఆలియా-రణబీర్ లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన నెలకే తాను మూడు నెలల ప్రెగ్నెంట్ అని తెలిపింది ఆలియా. అది దృష్టిలో పెట్టుకుని కమాల్ R ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story