Mon Dec 23 2024 02:15:14 GMT+0000 (Coordinated Universal Time)
అనసూయ వర్సెస్ నెటిజెన్స్.. రష్మీని కూడా లాగారు..!
ఓ నెటిజన్ మాత్రం యాంకర్ రష్మీని గుర్తు చేసుకున్నాడు.
అప్పట్లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాపై అనసూయ చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదం మొదలైన సంగతి తెలిసిందే. అప్పట్లో అనసూయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. మళ్లీ ఇప్పుడు లైగర్ రిలీజ్ సందర్భంగా ఆ యుద్ధం మళ్లీ మొదలైంది. లైగర్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. లైగర్ కు నెగటివ్ టాక్ రావడంతో అనసూయ 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా' అంటూ ట్వీట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలుపెట్టారు.
ఆ తర్వాత తనను అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మీరు ఎన్ని అంటున్నా తాను దయతో వ్యవహరిస్తున్నానని... అందుకే మీరు ఇలా చేస్తున్నారని చెప్పారు. తనను ఆంటీ అని పిలుస్తూ అవమానించేలా పోస్టులు పెడుతున్నారని... ఇకపై ఇలాంటి పోస్టులు పెడితే స్క్రీన్ షాట్లను తీసి, పోలీసు కేసు పెడతానని హెచ్చరించారు. తనను అనవసరంగా ఇబ్బంది పెట్టినందుకు మీరు బాధపడే స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు. దీంతో ఆ తర్వాత ట్విట్టర్ లో 'aunty' అనే వర్డ్ ను ట్రెండ్ చేసారు.
ఓ నెటిజన్ మాత్రం యాంకర్ రష్మీని గుర్తు చేసుకున్నాడు. అనసూయతో పోల్చితే రష్మీ ఎంతో బెటర్ అని.. ఆమె ఇవన్నీ పట్టించుకోదు.. ఎవ్వరికీ రిప్లై ఇవ్వదు.. అసలు తెలుగే అర్థం కాదంటూ ట్వీట్ వేశాడు. దీనికి రష్మీ రిప్లై ఇస్తూ.. పండుగ చేసుకో అని కామెంట్ వేసింది.
Next Story