Mon Dec 23 2024 02:30:41 GMT+0000 (Coordinated Universal Time)
టాటూలా.. అమ్మో వద్దంటున్న సమంత
స్వయంగా మూడు టాటూలు వేయించుకున్న సమంత టాటూలను అసలు వేయించుకోకండి అని చెప్పడం విని చాలా మంది ఆశ్చర్యపోయారు.
నటి సమంత ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నోత్తరాల సెషన్‌ను నిర్వహించింది. సోషల్ మీడియాలో తన అభిమానులతో కాండిడ్ చాట్ సందర్భంగా, సమంతా టాటూ వేయించుకోవద్దని వారికి సలహా ఇచ్చింది. స్వయంగా మూడు టాటూలు వేయించుకున్న సమంత టాటూలను అసలు వేయించుకోకండి అని చెప్పడం విని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు టాటూలు వేసుకోవడం అసలు ఇష్టం లేదని నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చింది. "నా సలహా పచ్చబొట్టు వేయించుకోకండి. ఎప్పటికీ.. టాటూ వేయించుకోవద్దు" అని సమంత తెలిపింది.
సమంత మూడు టాటూలను కలిగి ఉన్న సంగతి తెలిసిందే, అవన్నీ ఆమె మాజీ భర్త నాగ చైతన్యకు సంబంధించినవి. సమంత మొదటి టాటూ 'YMC' అని ఉంది, ఇది సామ్-చైతూ కలిసి నటించిన మొదటి చిత్రం 'ఏ మాయ చేసావే'కి సంక్షిప్త రూపం. చైతు- సమంత ఇద్దరూ తమ చేతులపై రెండు బాణాలతో కూడిన ఒకే టాటూను వేయించుకున్నారు. మూడో టాటూ ఆమె కుడి పక్కటెముకపై 'ఛే' అని రాసి ఉంది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత సమంత మాజీ భర్త నాగ చైతన్యతో విడిపోయింది. అందుకే ఇప్పుడు టాటూలు వేసుకోకండి అని చెబుతోంది. ఎవరి లైఫ్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో.. అందుకే ఇలాంటి వద్దు అంటూ మెసేజీలు ఇస్తోంది సమంత.
Next Story