లెక్క మారింది!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక రెండేళ్ల గ్యాప్ టీయూస్కుని సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ [more]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక రెండేళ్ల గ్యాప్ టీయూస్కుని సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ [more]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక రెండేళ్ల గ్యాప్ టీయూస్కుని సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వెంటవెంటనే మూడు సినిమాలు లైన్ లో పెట్టేసాడు. వేణు శ్రీరామ్ తో వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. క్రిష్ తో పిరియాడికల్ మూవీ, హరీష్ శంకర్ తో కమర్షిల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అయితే మూడు సినిమాల షూటింగ్స్ కరోనా వలన వాయిదా పడ్డాయి. ఈలోపు పవన్ కళ్యాణ్ పూరి జగన్నాధ్ తోనూ, త్రివిక్రంతోను సినిమాలు కమిట్ అవుతున్నాడనే టాక్ వినిపించింది. తాజాగా పవన్ కళ్యాణ్ మలయాళ రీమేక్ అయ్యప్పన్ కోసియమ్ రీమేక్ లో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి.
మధ్యలో సై రా దర్శకుడు సురేందర్ రెడ్డి తో పవన్ సినిమా అన్నా అది గాసిప్ అనే అనుకున్నారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు పవన్ కి ఇండస్ట్రీ నుండి పొలిటికల్ పార్టీస్ నుండి విషెస్ వెల్లువలా రావడమే కాదు.. పవన్ కళ్యాణ్ న్యూ మూవీ లుక్స్ కూడా సోషల్ మీడియాలో అదే రేంజ్లో వచ్చాయి. వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ తో పాటుగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లుక్ విడుదల చేస్తే, క్రిష్ తో పవన్ చెయ్యబోయే పీరియాడికల్ మూవీ ప్రీ లుక్ వచ్చింది. అలాగే పవన్ – హరీష్ కాంబోలో తెరకెక్కబోయే PSPK28 మూవీ ప్రీ లుక్ పోస్టర్.
ఇక ఎవరూ ఊహించని విధంగా సురేందర్ రెడ్డితో పవన్ మూవీ ప్రకటన కూడా వచ్చేసింది. SRT మూవీస్ సురేందర్ రెడ్డి – పవన్ కాంబో మూవీని నిర్మించబోతున్నారు. మరి మూడు సినిమాలు ముగించేసి రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారని అంటే.. కాదు పవన్ వరసగా సినిమాలకే మొగ్గు చూపుతున్నాడనేది పవన్ పుట్టిన రోజునాడు ఫిక్స్ అయ్యింది. ఇక పవన్ త్రివిక్రమ్, పవన్ పూరి కాంబో సెట్ కాలేదు కానీ… ఎవరూ అనుకోని విధంగా లిస్ట్ లోకి సురేందర్ రెడ్డి వచ్చాడు. మరి పవన్ లెక్క మారినట్లుగానే కనబడుతుంది.