Mon Dec 23 2024 06:54:26 GMT+0000 (Coordinated Universal Time)
వైవా హర్ష ట్వీట్ కు రవితేజ రిప్లై.. ఆ మాత్రం ఉంటుంది మరీ
వైవా హర్ష ఆధ్వర్యంలో #SM అనే సినిమా వస్తోంది. ట్విట్టర్లో పెట్టిన ఈ సినిమా పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
ఓ చిన్న యూట్యూబ్ వీడియోతో తన ప్రస్తానానికి ప్రారంభించి సెలబ్రిటీగా ఎదిగిన వ్యక్తి వైవాహర్ష. అతని ఆధ్వర్యంలో వస్తున్న సినిమా ఎస్ ఎన్. దానికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ 'ఫస్ట్ లుక్ సూన్' అని రాశారు. ఆ పాస్టర్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. 76 ఏళ్ల వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకుని పరీక్ష రాస్తాడు. అన్ని స్పెల్లింగులు తప్పులే రాస్తాడు కానీ టీచర్ మాత్రం అన్నిటికీ రైట్ పెట్టీ పదికి పది మార్కులు వేస్తాడు. ఆ పోస్టర్ కిందన ఫస్ట్ లుక్ సూన్ అని రాశారు అది కూడా తప్పులు తడకలతో ఉండటం విశేషం. ట్విట్టర్ లో పెట్టిన ఈ పోస్టర్ కి మాస్ మహారాజ్ రవితేజ స్పందించారు. తమరు మాకు చెప్పిన కథ ఇదేనా మాస్టారు అంటూ ఫన్నీగా ప్రశ్నించారు ప్రస్తుతం ఈ పోస్టర్, రవితేజ స్పందన ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి.
Next Story