Mon Dec 23 2024 12:57:13 GMT+0000 (Coordinated Universal Time)
సోలో విడుదలకు రెడీ అవుతోన్న "రామారావు ఆన్ డ్యూటీ"
రవితేజ హీరోగా దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా “రామారావు ఆన్ డ్యూటీ” వచ్చే మార్చి 25న విడుదలవుతుంది
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా "రామారావు ఆన్ డ్యూటీ". ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. అందుకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు మేకర్స్. వచ్చే ఏడాది అనగా.. 2022, మార్చి 25వ తేదీన రామారావు డ్యూటీ ఎక్కనున్నట్లు ప్రకటించారు. సంక్రాతికి, ఆ తర్వాత ఫిబ్రవరి, ఏప్రిల్ మాసాల్లో భారీ బడ్జెట్ సినిమాలు ముందుగానే రిలీజ్ డేట్స్ ను బుక్ చేసుకున్నాయి. రామారావు సోలో విడుదలకు మార్చి నెలే మంచిదని భావించారట నిర్మాతలు.
పోస్టర్ రిలీజ్ తో....
ఇక సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే.. సోమవారం సినిమా పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో వెదురు కర్రను విసురుతూ ఫైటింగ్ కు వెళ్తున్నట్లు కనిపిస్తున్న రవితేజ చాలా స్మార్ట్ గా ఉన్నాడు. వెనకాలే పోలీసులు, గ్రామస్తులు కూడా కర్రలతో కనిపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే.. ఈ పోస్టర్ సినిమాలో ఉన్న ఓ భారీ ఫైట్ లోనిది అని తెలుస్తోంది. "రామారావు ఆన్ డ్యూటీ" చిత్రానికి సామ్ సిఎస్ సంగీతాన్ని సమకూర్చుతుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపూడి "రామారావు ఆన్ డ్యూటీ" మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. రవితేజ సరసన దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Next Story