Mon Dec 23 2024 09:07:03 GMT+0000 (Coordinated Universal Time)
"ఆహాపురం..సినిమాపురం" ప్రతి శుక్రవారం కొత్త సినిమా !
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. సెలబ్రిటీ టాక్ షో లు, సెలబ్రిటీ వంటలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న ఆహా.. సినిమాపురంతో
ఈ మధ్య చాలా సినిమాలు ఓటీటీల్లోనే విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లో బడ్జెట్ సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యేందుకు మొగ్గుచూపుతున్నాయి. అలాగే థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు కూడా నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీ విడుదళ్లకు రెడీ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. సెలబ్రిటీ టాక్ షో లు, సెలబ్రిటీ వంటలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న ఆహా.. సినిమాపురంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇకపై ప్రతి శుక్రవారం సినిమాపురం పేరుతో కొత్త సినిమాను తమ ఓటీటీలో విడుదల చేయనుంది ఆహా.
ఆహా.. తెలుగువారి కొత్త అలవాటు
ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఆహా మేకర్స్. ఆ వీడియోలో స్వయంగా బన్నీనే సినిమాపురాన్ని ప్రమోట్ చేస్తూ కనిపించాడు. ఓవైపు సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న బన్నీ.. మరోవైపు ఆహా ఓటీటీ ప్రమోషన్స్ పనులను కూడా తన భుజాలమీద వేసుకున్నాడు. సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసే సినిమాలను ప్రతి శుక్రవారం ఆహా అందిస్తుందని బన్నీ చెప్పుకొచ్చాడు. ఆహాపురంలో ప్రతి శుక్రవారం .. కొత్త సినిమా..అంటూ బన్నీ ప్రోమోలో కనిపిస్తాడు. ఆహా.. తెలుగువారి కొత్త అలవాటు అంటూ సాగే ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Next Story