Sun Dec 22 2024 22:11:25 GMT+0000 (Coordinated Universal Time)
ఈవారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే..
ఈవారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. కానీ ఈసారి తెలుగు కంటే.. ఇతర భాషల సినిమాలే ఎక్కువ..
థియేటర్లకు ఏ మాత్రం తీసిపోవట్లేదు ఓటీటీలు. థియేటర్లలో విడుదలైన సినిమాలు దాదాపు నెలరోజులకే ఓటీటీల్లో విడుదలవుతూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇందులో చిన్న, పెద్ద సినిమాలన్న తేడాల్లేవు. కరోనా సంక్షోభ సమయంలో.. థియేటర్లలో సినిమాలను విడుదల చేసే ఆస్కారం లేక ఓటీటీలు ముందుకొచ్చాయి. అప్పటి నుంచీ ఇవి ఆదరణ పొందుతున్నాయి. ప్రతీవారం సరికొత్త కంటెంట్ తో, మంచి క్వాలిటీతో ఓటీటీల్లో సినిమాలు విడుదలవుతున్నాయి.
ఈవారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. కానీ ఈసారి తెలుగు కంటే.. ఇతర భాషల సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఆహా లో ఇప్పటికే వినరో భాగ్యము విష్ణుకథ స్ట్రీమ్ అవుతోంది. కమెడియన్ వేణు అలియాస్ టిల్లు దర్శకత్వంలో తెరకెక్కి.. థియేటర్లలో విడుదలై ప్రజాదరణ పొందిన బలగం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. బకాసురన్ (తమిళ్), రెగ్గీ (ఇంగ్లిష్), క్రైమ్స్ ఆజ్ కల్ (హిందీ), ఏ మ్యాన్ కాల్డ్ ఓట్టో (ఇంగ్లిష్, స్పానిష్) సినిమాలు కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో బోస్టన్ స్ట్రాంగ్లర్ (ఇంగ్లిష్), నెట్ ఫ్లిక్స్ లో చోర్ నికాల్ కే భాగా (హిందీ), హూ ఉయ్ వర్ రన్నింగ్ ఫ్రమ్ ?(టర్కిష్), జీ5 ఓటీటీలో పూవన్ (మలయాళం), సెంగలమ్ (తమిళ్), కంజూస్ మఖిచూస్ (హిందీ), దే ధక్కా-2(మరాఠీ) సినిమాలు, సోనీలివ్ లో పురుష ప్రేతం (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం) సినిమాలు, బుక్ మై షో ఓటీటీలో ఇన్ సైట్ (ఇంగ్లిష్) స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Next Story