Mon Dec 23 2024 10:38:04 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ షూటింగ్ పోస్టర్.. 50 రోజుల్లో సినిమా రిలీజ్!
మార్చి 25వ తేదీన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రమోషన్స్ లో బిజీ అయింది చిత్ర బృందం.
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈసారి విడుదల పక్కా అంటూ.. మరో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. మార్చి 25వ తేదీన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రమోషన్స్ లో బిజీ అయింది చిత్ర బృందం.
Also Read : ఎఫ్ 3.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ !
అందులో భాగంగా ట్రిపుల్ ఆర్ షూటింగ్ పోస్టర్ ను పోస్ట్ చేశారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బైక్పై వెళ్తున్నట్లు ఈ ఫొటో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సారైనా చెప్పిన డేట్ కి సినిమాను విడుదల చేస్తారా ? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story