Mon Dec 23 2024 16:25:36 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీరామనవమి స్పెషల్.. రామబాణం నుంచి గోపీచంద్, జగపతిబాబు లుక్
ఈ పోస్టర్లో గోపీచంద్ తో పాటు.. సీనియర్ ఫ్యామిలీ హీరో జగపతిబాబు కూడా ఉన్నాడు. ఇద్దరూ వైట్ అండ్ వైట్ కాంబినేషన్లో..
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తోన్న తాజా సినిమా "రామబాణం". పక్కా కమర్షియల్ తర్వాత గోపీచంద్ నటిస్తోన్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిటీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో కలిసి బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 కి వచ్చినపుడే గోపీచంద్ ఈ సినిమా గురించి ప్రస్తావించాడు. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ శ్రీవాస్ ముచ్చటగా మూడోసారి గోపీచంద్ తో కలిసి రామబాణం ను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అని రెండుసార్లు రుజువు కావడంతో.. ఈ సినిమాలో ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, అది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా.. మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో గోపీచంద్ తో పాటు.. సీనియర్ ఫ్యామిలీ హీరో జగపతిబాబు కూడా ఉన్నాడు. ఇద్దరూ వైట్ అండ్ వైట్ కాంబినేషన్లో చేతులు పట్టుకుని వెళ్తోన్న పోస్టర్ ను నేడు విడుదల చేశారు. ఈ సినిమాలో ఖుష్భూ గోపీచంద్ వదిన పాత్రలో నటిస్తుండగా.. ఖిలాడీ లేడీ డింపుల్ హయతి గోపీచంద్ సరసన నటిస్తోంది. అయితే జగపతిబాబు గోపీచంద్ కు తండ్రి క్యారెక్టర్లో నటిస్తున్నాడా ? లేక అన్నగా కనిపించబోతున్నారా? అన్నది మాత్రం సస్పెన్స్. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Next Story