Mon Dec 23 2024 05:25:37 GMT+0000 (Coordinated Universal Time)
ది వారియర్ నుంచి కొత్త పోస్టర్.. రామ్ లుక్ మామూలుగా లేదు !
ఉగాది పర్వదినం సందర్భంగా ది వారియర్ సినిమా టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ..కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.
హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ చాక్లెట్ బాయ్ గా ఉన్న హీరో రామ్.. ఇక మాస్ హీరోగా ఎదిగేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల్లో మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. తాజాగా వారియర్ సినిమాతో మరోసారి మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు రామ్. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న 'ది వారియర్' సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు.
ది వారియర్ లో రామ్ సరసన కృతిశెట్టి నటిస్తోంది. ఉగాది పర్వదినం సందర్భంగా ది వారియర్ సినిమా టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ..కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో రామ్ పోతినేని సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. రామ్ లుక్ చూస్తుంటే సినిమాలో చాలా పవర్ ఫుల్ గా రోల్ ను పోషించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూలై 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Next Story